హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన యూపీఐ లావాదేవీల విలువ

యూపీఐ లావాదేవీలు గత ఐదేళ్లలో 273 శాతం పెరిగాయి. ఈ సమాచారాన్ని లోక్‌సభకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి అందించారు. 2026 జూన్ నాటికి UPI వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు చేరినట్లు తెలిపారు. UPI చెల్లింపులను భద్రంగా, సురక్షితంగా మార్చేందుకు RBI, NPCI చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 10 దేశాల్లో యూపీఐని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.