హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సీఎం పర్యటన కోసం పంట ధ్వంసం

కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఆస్పరి మండలంలో వీఐపీ వాహనాల పార్కింగ్ కోసం ఓ రైతు జొన్న పంటను అధికారులు సమాచారం ఇవ్వకుండానే ధ్వంసం చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరువు పరిస్థితుల్లో పశువుల మేతకు ఉపయోగపడే పంటను ఎందుకు దున్నేశారని రైతు అధికారులను ప్రశ్నించారు. దీనిపై తమకు ఎం తెలియదంటూ అధికారులు వెళ్లిపోయినట్లు సమాచారం.