హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం, పందిళ్లపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ఈ-పంటలో నమోదు చేసుకోవాలని, పత్తి రైతులు జూలై 24లోపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.