హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జంక్ ఫుడ్ తినడం మానలేకపోతున్నారా?

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేందుకు ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేయాలి. బయటి ఆహారం తినాలనిపించినప్పుడు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇంట్లోనే ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసుకోవాలి. క్రమంగా జంక్ ఫుడ్‌ను తగ్గించి, పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది.