హైదరాబాద్: 28°C
భక్తి

పూరీ జగన్నాథుడికి జలుబు, జ్వరం

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఏటా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 108 కుండల పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఈ అధిక జల స్నానం వల్ల శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి జలుబు, జ్వరంతో బాధపడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ జ్వరం, జలుబు కారణంగా స్వామివారిని 15 రోజుల పాటు గర్భగుడి నుంచి ఏకాంత మందిరానికి మారుస్తారు. ఈ 15 రోజుల పాటు సాధారణ పూజలు, నైవేద్యాలు నిలిపివేస్తారు.