హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం జరిగింది. ఘంటా మండపం వద్ద గరుత్మంతునికి అభిముఖంగా ఉభయదేవేరులతో మలయప్పస్వామి వేంచేపు చేశారు. మరో పల్లకిపై విష్వక్సేనులు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్లు మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు.