హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు, షెడ్లు నిండి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,556 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.