కోనసీమ: భర్త విజయకృష్ణ,కుటుంబ సభ్యులు గృహ హింసకు గురి చేస్తున్నారంటూ.. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బీమనపల్లి సింగరాయపాలేనికి చెందిన శీలం నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు SI జానీ బాషా గురువారం తెలిపారు. 2014లో పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం, అనుమానంతో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
వార్తలు
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మహిళ పిర్యాదు


