తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు, షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,255 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు


