హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 తగ్గి రూ.1,42,530కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 దిగివచ్చి రూ.1,30,650గా నమోదైంది. కాగా, కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.