హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో ఫైనాన్సియల్‌ లాభంలో 156% వృద్ధి

జియో పైనాన్షియల్ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 150% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.325 కోట్లు మాత్రమే. కంపెనీ మొత్తం ఆదాయం 3 రెట్లు పెరిగి రూ.2,005 కోట్లకు చేరింది. బ్లాక్ రాక్, అలియాంజ్ భాగస్వామ్యంతో బీమా, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో మరింత విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.