గబగబా భోజనం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆకలి తీర్చుకోవడం వేరు, ఆహారాన్ని ఆస్వాదించడం వేరు. త్వరగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యలు వస్తాయి. మెదడుకు 'కడుపు నిండిందనే' సంకేతం అందక, అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి, ప్రతి ముద్దను బాగా నమిలి, నిదానంగా ఆస్వాదిస్తూ తినాలి.
ఆరోగ్యం
గబగబా భోజనం చేస్తున్నారా..?


