BDK: మణుగూరు గుట్ట మల్లారం ప్రాంతంలోని సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
కార్ల షోరూంలో అగ్నిప్రమాదం..


