హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన

NLG: దేవరకొండలో నూతన తహసీల్దార్, మున్సిపల్ ఆఫీస్‌ల కోసం ఎమ్మెల్యే బాలునాయక్ గురువారం అధికారులు, నాయకులతో కలిసి పాత బజార్‌లో స్థల పరిశీలన చేశారు. తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయ నిర్మాణానికి రూ.2 కోట్ల 25 లక్షలు, మున్సిపల్ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి రూ.7 కోట్ల 60 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.