VKB: తాండూర్ పట్టణంలోని గ్రీన్ సిటీ బ్రిడ్జి చివరలో అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు తాండూర్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలు తెలుసుకుంటున్నారు.
వార్తలు
లారీ, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు


