హైదరాబాద్: 28°C
క్రీడలు

దూకుడు, టైమింగ్‌పై అక్షర్ ప్రత్యేక దృష్టి

టీ20ల్లో దూకుడుగా ఆడటంపై, వన్డేల్లో టైమింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వెల్లడించాడు. జట్టు విజయంలో తాను రాణించడం చాలా ముఖ్యమన్న విషయాన్ని ఎల్లప్పుడూ మైండ్‌లో ఉంచుకుంటానని చెప్పాడు. మైదానంలో తన ప్లాన్లను పక్కాగా అమలు చేసే ఆత్మవిశ్వాసం తనలో పూర్తిగా ఉందని అక్షర్ ధీమా వ్యక్తం చేశాడు.