హైదరాబాద్: 28°C
క్రీడలు

షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ సత్తా

ISSF షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ నీరూ దండా సత్తా చాటింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో ఆమె స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో ఆమె 27 సార్లు లక్ష్యాన్ని కాల్చింది. ISSF ప్రపంచకప్‌లో నీరూకు ఇది తొలి వ్యక్తిగత పతకం కావడం గమనార్హం. ఫ్రాన్స్ షూటర్ కరోల్ కార్మెనీర్ (25) రజతం సాధించింది. ఎరికా సెసా (ఇటలీ)కు కాంస్యం దక్కింది.