హైదరాబాద్: 28°C
క్రీడలు

డైమండ్‌ లీగ్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్

మొనాకో డైమండ్ లీగ్‌లో భారత అథ్లెట్ సర్వేష్ కుషారె అదరగొట్టాడు. తొలిసారి డైమండ్ లీగ్‌కు అర్హత సాధించిన సర్వేష్.. 2.26 మీటర్ల హైజంప్‌తో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో ఈ విభాగంలో పోడియంపై నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు. ప్రపంచ ఇండోర్ ఛాంపియన్ ఒలె (ఉక్రెయిన్, 2.32 మీటర్లు), జాక్ కిమాని (2.30 మీ) తొలి రెండు స్థానాలు దక్కించున్నారు.