హైదరాబాద్: 28°C
క్రైమ్

పరుపుల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

TG: HYDలోని IDA బొల్లారంలో ఉన్న ఓ పరుపుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో మంటలు ఎగిసిపడుతూ దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పరుపుల గోడౌన్లలో మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరిగిపోతోంది.