హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ముఖంపై వ్యాక్స్‌ చేస్తున్నారా?

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. చర్మతత్వాన్ని బట్టి వ్యాక్స్ స్ట్రిప్స్ ఎంచుకోకపోతే చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు, సున్నితత్వం వంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఇంట్లో తయారుచేసిన వ్యాక్స్ అయినా, బయట కొన్న స్ట్రిప్స్ అయినా వాడేముందు తప్పనిసరిగా 'ప్యాచ్ టెస్ట్' చేసుకోవాలి. లేదంటే ఎండలో వెళ్లినప్పుడు చర్మం కందిపోయే ప్రమాదం ఉంది.