హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

AP: వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి, గరుడ కూడలి వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండిపోయింది. దీంతో సాధారణంగా ఉ.10 గం.కు ఇచ్చే టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లను, TTD ఉ.5 గం.కే జారీ చేసింది. రద్దీగా ఉండటంతో భక్తులను క్యూలైన్లలోకి అనుమతించడం లేదు.