తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,265 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,690 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు


