హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలంలో 13న వీహెచ్ మౌనదీక్ష

BDK: అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 13న భద్రాచలంలో V.H. హనుమంతరావు మౌనదీక్ష చేపట్టనున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధ్యక్షతన జరగనున్న ఈ దీక్షలో, దైవద్రోహాలపై సీబీఐ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీక్షకు రామభక్తులు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని ఆయన కోరారు.