హైదరాబాద్: 28°C
వార్తలు

నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి

కృష్ణా: మైనార్టీ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ ని కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాల గ్రామంలో జామియా మసీదు ప్రభుత్వం సహాయంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ. 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మసీదును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.