హైదరాబాద్: 28°C
వార్తలు

నేత్రదానం.. ఇద్దరి జీవితాల్లో వెలుగు

NZB: జిల్లా పొతంగల్ (M) చేతన్ నగర్ చెందిన మల్లాది రమారాణి మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బోధన్‌లో ఆసుపత్రి వైద్య బృందం గ్రామానికి చేరుకొని నేత్రాలను సేకరించింది. ఒకరి మరణం మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపేలా చేసిన ఈ నిర్ణయాన్ని స్థానికులు, వైద్య బృందం అభినందిస్తూ.. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలన్నారు.