హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం..!

WG: రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.1.82 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పాతపాడుకు చెందిన కుటుంబరావును, పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలకు చెందిన గెడ్డం దుర్గ వరప్రసాద్ అనే ఏజెంట్ ఆశ చూపించి నగదు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే సదరు ఏజెంట్, అతని కుటుంబ సభ్యులు బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.