హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే బెల్లం, శనగలు తింటే?

బెల్లం, శనగల కలయిక గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం ఉంటాయి. ఐరన్ శరీరంలో రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తహీనత సమస్య రాదు. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. శనగల్లో గుండెకు మేలు చేసే విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తాయి.