హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

హలాసనం వల్ల కలిగే ఉపయోగాలు

హలాసనం (నాగలి భంగిమ) వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెన్నెముకను సాగదీసి, దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. వెన్నునొప్పి సమస్యలను తగ్గిస్తుంది. పొట్టలోని అవయవాలకు మసాజ్ చేయడం ద్వారా జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ ఆసనం థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. మెదడు, ముఖం, మెడ ప్రాంతాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.