AKP: జిల్లాస్థాయి మెన్ జూనియర్ హాకీ ఎంపిక పోటీలకు 45 మంది క్రీడాకారులు హాజరైనట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ తెలిపారు. ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు 18 మందిని ఎంపిక చేస్తామన్నారు. సెలక్టర్లుగా ఉదయ్, సాయి, దుర్గాప్రసాద్ వ్యవహరించారు.
వార్తలు
45 మంది క్రీడాకారులు హాజరు


