హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రంగనాథ స్వామికి ఘనంగా తులసి అర్చన

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామికి ప్రత్యేకంగా తులసి అర్చన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు విష్ణు నారాయణ తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.