హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు క్రీడాకారులకు ఎస్పీ ఘన సన్మానం

WNP:హైదరాబాద్‌లో జరిగిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పోలీసులు మొత్తం 12 పతకాలు సాధించి విశిష్ట ప్రతిభ కనబర్చారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఎస్పీ సునిత రెడ్డి పతక విజేతలను ఘనంగా సన్మానించి అభినందించారు. ఇదే విజయోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.