హైదరాబాద్: 28°C
వార్తలు

'బహుభార్యత్వం పాటిస్తే ప్రభుత్వ పథకాలు రావు'

ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే వారికి.. ప్రభుత్వ పథకాలు రావని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించింది. బహుభార్యత్వాన్ని పాటించే వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి జయంత మల్ల బారువా తెలిపారు.