W.G: వృక్ష సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో వనమహోత్సవం నిర్వహించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు కే.మాధవి, పీ.బాబు, లలితా దేవి, ఏపీపీ శివరామకృష్ణ పాల్గొన్నారు.
వార్తలు
వనమహోత్సవంలో పాల్గొన్న జడ్జి


