హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

PPM: సీతానగరం మండలం పెదంకలాం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డా. తెర్లి హేమాక్షి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద వైద్యం ద్వారా వ్యాధుల నివారణ, జీవనశైలి మార్పులు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.