హైదరాబాద్: 28°C
వార్తలు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు

చత్తీస్‌గడ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు సహా 17 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగుస్తున్న తరుణంలో ఎనిమిది మంది మహిళలతో కూడిన ఈ బృందం జనం బాట పట్టింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడైన పాపారావు లొంగుబాటు కీలక పరిణామం. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, ఐజీ సుందర్ రాజ్ సమక్షంలో వీరు లొంగిపోయారు.