హైదరాబాద్: 28°C
వార్తలు

దోమల నివారణపై సైబరాబాద్‌లో విస్తృత అవగాహన

HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 'ఫ్రైడే డ్రై డే' కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలు, కాలనీలు, ప్రజా ప్రదేశాల్లో దోమల నివారణపై అవగాహన, యాంటీ లార్వా చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం ఐదు నిమిషాలు కేటాయించి నిల్వ నీటిని తొలగించాలని అధికారులు, గవర్నమెంట్ టీచర్లకి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.