హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప్పల్–ఆరాంఘర్ రూట్‌లో బస్సుల జోరు..!

HYD: ఉప్పల్- మెహిదీపట్నం- ఆరాంఘర్ 300 రూట్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తోంది. రోజూ 107 బస్సులతో 428కు పైగా ట్రిప్పులు నిర్వహిస్తోంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 3- 4 నిమిషాలకు ఒక బస్సు నడుపుతూ రోజుకు 60- 70 వేల మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తోంది.