హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

WNP: వార్షిక తనిఖీల్లో భాగంగా సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తనిఖీ చేశారు. శుక్రవారం ఆమె సందర్శించి రికార్డులు, పెండింగ్ కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, త్వరితగతిన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు.