హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

SKLM: కంచిలి మండలం రేఖాదేవిపురం గ్రామంలో శుక్రవారం 140 మీటర్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని, రహదారుల అభివృద్ధితో ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి పాల్గొన్నారు.