హైదరాబాద్: 28°C
వార్తలు

'అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలి'

ప్రకాశం: పామూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు నిర్వహించిన సమావేశంలో తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్ నిబంధనలు సవరించాలని కోరారు. నవచేతన యాప్ రద్దు చేయాలన్నారు.