హైదరాబాద్: 28°C
వార్తలు

గిన్నిస్‌కి వెళ్తున్న 72 కిలోల పనస

కర్ణాటకలోని సక్లేష్‌పూర్ పనస, మామిడి మేళాలో 72 కేజీల బరువైన పనస పండు అందరినీ ఆశ్చర్యపరిచింది. హెబ్బనహళ్లికి చెందిన ప్రతాప్ కుమార్ తన తోటలో పండిన ఈ భారీ పండును ప్రదర్శించారు. ప్రస్తుతం గిన్నిస్ రికార్డులో 54.43 కిలోల పనసపండే అత్యంత బరువైనదిగా ఉంది. దీంతో ఈ పళ్లను ప్రపంచ రికార్డు కోసం పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.