హైదరాబాద్: 28°C
వార్తలు

చార్‌ధామ్ యాత్రకు అంతరాయం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రోడ్డుపైకి భారీగా బండరాళ్లు, మట్టి వచ్చి పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రసిద్ధ చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.