హైదరాబాద్: 28°C
వార్తలు

కళాశాల తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను ప్రత్యేక అధికారి మహేందర్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం తయారీ విధానం, నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు.