హైదరాబాద్: 28°C
వార్తలు

న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరానికి చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడకు వెళ్లారు. గత నాలుగు దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.