హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు సైబర్ నేరలపై అవగాహన

కృష్ణా: గుడివాడ (మం) బేతవోలులోని ఎస్జీఆర్కే హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థుల కోసం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ దుష్పరిణామాలు, సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను ఎలా ఉపయోగించుకోవాలో సూచించారు.