హైదరాబాద్: 28°C
వార్తలు

'సహకార సంఘాల్లో టెక్నాలజీ వినియోగం'

KRNL: జిల్లాలోని సహకార సంఘాల పరిపాలనలో ఆధునిక సాంకేతిక విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అన్ని సంఘాల ఉద్యోగులను హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS) మాడ్యూల్‌లో అనుసంధానించి, జీతాల చెల్లింపులు కూడా అదే విధానంలో నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.