హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ వైఖరిపై రాజ్ ఠాక్రే విమర్శల వర్షం

అధికారంలో ఉన్నామనే నెపంతో ప్రభుత్వం ప్రతి లోపాన్నీ సమర్థించుకోవడం సరికాదని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే విమర్శించారు. అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై ప్రశ్నిస్తే భక్తులకు మత వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సభ్యులు ఎక్కువగా ఉన్న ట్రస్ట్‌లో చోరీ ఎలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.