E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలపై 23 వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న MLA ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం


