హైదరాబాద్: 28°C
వార్తలు

కదిరిలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

SS: కదిరి పట్టణంలోని 33వ వార్డు మూర్తిపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలను నేరుగా కలిసి హౌసింగ్, పెన్షన్లు, తక్కువ వోల్టేజ్ సమస్యలపై వినతులు స్వీకరించారు. మెజారిటీ సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యతతో వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.