హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేటలో 12 మొబైల్స్ రికవరీ!

PLD: చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి.అనిల్ కుమార్ సాంకేతిక పరిజ్ఞానంతో 12 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. తమిళనాడు, యూపీ, ఒడిశా నుంచి వాటిని గుర్తించి తెప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం బాధితులకు స్వయంగా అందజేశారు. సెల్‌ఫోన్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.